'వంద' నోటు చెల్లదంట.. ఎప్పటి నుంచి అంటే..

ఈ నోట్లను ఉపసంహరించుకోవాలని బ్యాంకు యోచిస్తోంది. జిల్లా పంచాయితీలోని నేత్రావతి హాల్‌లో బ్యాంకు ఏర్పాటు చేసిన

Update: 2021-01-23 09:51 GMT

withdraw rs 100 notes : రాత్రికి రాత్రే తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం‌తో సామాన్య ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడింది ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. ఇప్పుడు తాజాగా మరో షాకింగ్ న్యూస్ చెప్పనుంది ఆర్‌బీఐ. 2021లో తన నిర్ణయాన్ని అమలు పరచాలనుకుంటున్నట్లు సమాచారం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) అసిస్టెంట్ జనరల్ మేనేజర్ బి మహేష్ మాట్లాడుతూ మార్చి, ఏప్రిల్ చివరి నాటికి రూ.100, రూ.10, రూ.5 తో సహా పాత కరెన్సీ నోట్లు చెల్లకుండా పోయే అవకాశం ఉందని చెప్పారు. ఈ నోట్లను ఉపసంహరించుకోవాలని బ్యాంకు యోచిస్తోంది. జిల్లా పంచాయితీలోని నేత్రావతి హాల్‌లో బ్యాంకు ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి భద్రతా కమిటీ, జిల్లా స్థాయి కరెన్సీ మేనేజ్‌మెంట్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వ్యాపారులు, వ్యాపారవేత్తలు రూ.10 నాణేలు నకిలీవని అనుమానిస్తున్నారు. వాటి గురించి ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.

2019 నుంచి ఆర్‌బిఐ కొత్త రూ.100 కరెన్సీ నోట్లను ఇవ్వడం ప్రారంభించింది. 

Tags:    

Similar News