Reliance:మరణించిన కుటుంబాలకు అండగా రిలయన్స్ ఫ్యామిలీ..
ఇటువంటి పరీక్షా సమయాల్లో, ఒకరికొకరు నిలబడటం అత్యవసరం అని రిలయన్స్ గ్రూప్ భావించింది.;
మహమ్మారి సమయంలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకునేందుకు రిలయన్స్ ఫ్యామిలీ సపోర్ట్ అండ్ వెల్ఫేర్ పథకం సహాయం చేస్తుంది.
COVID-19 యొక్క 2 వ వేవ్ భారతదేశంపై చాలా తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఈ సంవత్సరం వేలాది మంది తీవ్ర సంక్రమణకు గురైనందున, దేశవ్యాప్తంగా ఉన్నచాలా కుటుంబాలు ప్రియమైనవారిని, సహచరులను, స్నేహితులను కోల్పోయారు. ఈ బాధాకరమైన పరిస్థితిని ఎదుర్కోవటానికి దేశ ప్రజలు కష్టపడుతున్నారు.
ఇటువంటి పరీక్షా సమయాల్లో, ఒకరికొకరు నిలబడటం అత్యవసరం అని రిలయన్స్ గ్రూప్ భావించింది. మహమ్మారి సమయంలో మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఆర్థిక భరోసాని ఇస్తూ, రిలయన్స్ ఫ్యామిలీ సపోర్ట్ అండ్ వెల్ఫేర్ పథకాన్ని ప్రకటించింది .
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ, రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నీతా అంబానీ ఈ పథకం గురించి మాట్లాడుతూ "ఒక రిలయన్స్ ఫ్యామిలీ" మెంబర్ గా మీ కుటుంబంలోని ఓ ప్రియమైన వ్యక్తిని కోల్పోయిన భర్తీని మేము పూడ్చలేనప్పటికీ, ఈ కష్టకాలంలో ఆ కుటుంబానికి అండగా నిలబడడానికి మేము కట్టుబడి ఉన్నాము. రిలయన్స్ ఉద్యోగుల సంరక్షణకు అత్యధిక ప్రాముఖ్యత ఇస్తుంది అని అన్నారు.
రిలయన్స్ ఫ్యామిలీ సపోర్ట్ అండ్ వెల్ఫేర్ స్కీమ్ కింద :
రిలయన్స్ నామినీకి మరణించిన కుటుంబసభ్యులు చివరిగా డ్రా చేసిన నెలవారీ జీతం 5 సంవత్సరాలు అందిస్తూనే ఉంటుంది.
పిల్లలందరికీ భారతదేశంలోని ఏ ఇనిస్టిట్యూట్‌లోనైనా 100 శాతం ట్యూషన్ ఫీజు, హాస్టల్ వసతితో పాటు బ్యాచిలర్ డిగ్రీ వరకు చెల్లిస్తుంది.
జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు మరియు పిల్లలకు (పిల్లల బ్యాచిలర్ డిగ్రీ వరకు) హాస్పిటలైజేషన్ కవరేజ్ కోసం రిలయన్స్ 100 శాతం ప్రీమియం చెల్లింపును భరిస్తుంది.
ఉద్యోగుల కుటుంబానికి 5 సంవత్సరాల జీతం
ఆఫ్-రోల్ ఉద్యోగుల కుటుంబానికి ఒక్కొక్కరికి 10 లక్షలు
Reliance:ఉద్యోగులందరికీ ఉచితంగా టీకాలు. అంతేకాకుండా, COVID-19 ద్వారా ప్రభావితమైన సహోద్యోగులందరూ వ్యక్తిగతంగా లేదా వారి కుటుంబంలో ఎవరైనా కోవిడ్ బారిన పడితే వారు కోలుకునే వరకు ప్రత్యేక COVID- సెలవును పొందవచ్చు.
సహోద్యోగులు పూర్తిగా కోలుకోవడం లేదా వారి కుటుంబ సభ్యులను చూసుకోవడంపై మాత్రమే దృష్టి సారించేలా ఈ సెలవు విధానం విస్తరించబడింది.
రిలయన్స్ గ్రూప్ ఉద్యోగులను ఉద్దేశించి ఒక లేఖలో, ముఖేష్ అంబానీ ఇలా వ్రాశారు, "ప్రియమైన సహోద్యోగి, ఈ సమయం చాలా క్లిష్టమైనది. మీరు ఒంటరిగా లేరని గుర్తుంచుకోండి.
రిలయన్స్ సంస్థ మీలో ప్రతి ఒక్కరితో పాటు మీ కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తుంది. కానీ పోరాట పటిమను మనం వదులుకోకూడదు. ఎందుకంటే మనందరికీ మంచి రోజులు రాబోతున్నాయి. ఆ సమయం వచ్చేవరకు అవసరమైన బలాన్ని ఇవ్వాలని మేము ప్రార్థిస్తున్నాము. "
ప్రియమైన వ్యక్తిని కోల్పోవడం వల్ల ఏర్పడిన గాయాలను ఏదీ నయం చేయలేనప్పటికీ, ఆర్థిక సహాయం కొండంత అండను, జీవన పోరాటాలను ఎదుర్కోవడంలో ఖచ్చితంగా సహాయపడతాయి.