శశికళకి షాక్... ఓటరు లిస్టులో పేరు గల్లంతు..!
వీకే శశికళ పేరు ఓటర్ల జాబితాలో కనిపించలేదు. అసెంబ్లీ పోల్ కి ఒక్కరోజు ముందు ఈ విషయం బయటకు వచ్చింది.;
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు వీకే శశికళ పేరు.. ఓటర్ల జాబితాలో కనిపించలేదు. అసెంబ్లీ పోల్ కి ఒక్కరోజు ముందు ఈ విషయం బయటకు వచ్చింది. 20 ఏళ్లుగా థౌజండ్ లైట్స్ నియోజకవర్గంలో శశికళకి ఓటు హక్కు ఉంది. అయితే పోయెస్ గార్డెన్ లోని ఆస్తులను జప్తు చేశాక ఆమె పేరును అధికారులు తోలిగించారట.. శశికళ పేరును కావాలనే AIADMK తీసేసిందని టీటీవీ దినకరన్ ఆరోపించారు. కాగా అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలుశిక్ష అనుభవించి జనవరి 27న విడుదలైన శశికళ.. అనూహ్యంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన సంగతి తెలిసిందే..!