Priyanka Gandhi: ఇవాళ చట్టాలు రద్దు చేస్తామంటున్న కేంద్రాన్ని ఎలా నమ్మాలి: ప్రియాంక గాంధీ

Priyanka Gandhi: స్వయంగా ప్రధాని మోడీనే ఆందోళన్ జీవి అన్న పదాన్ని ఉపయోగించారని గుర్తు చేశారు.

Update: 2021-11-19 08:59 GMT

Priyanka Gandhi: రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపై కేంద్రం టెర్రరిస్టులు,గుండాలు, దేశ ద్రోహులుగా ముద్రవేసిందన్నారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకగాంధీ. ఇంత జరుగుతున్నా ఆనాడూ ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. స్వయంగా ప్రధాని మోడీనే ఆందోళన్ జీవి అన్న పదాన్ని ఉపయోగించారని గుర్తు చేశారు.

రైతులను చంపింది, వారిపై లాఠీలు ప్రయోగించింది ఎవరూ అని ప్రశ్నించారు ప్రియాంక. ఇవాళ చట్టాలు రద్దు చేస్తామంటున్న కేంద్రాన్ని ఎలా నమ్మాలన్నారు. రైతుల కంటే గొప్ప ఎవరూ కాదన్న విషయాన్ని కేంద్రం గుర్తించినందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు.

ఎన్నికలు సమీపిస్తున్నందునే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందన్నారు ప్రియాంక. క్షేత్ర స్థాయిలో పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి అర్థమైందన్నారు. అందువల్లే ఎన్నికల ముందు క్షమాపణలు చెప్పారన్నారు.

Tags:    

Similar News