Shivraj Singh Chouhan : రికార్డు సృష్టించిన మధ్యప్రదేశ్‌ సీఎం..!

Shivraj Singh Chouhan : మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ రికార్డు సృష్టించారు. అత్యధిక కాలం బీజేపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా నిలిచారు.

Update: 2022-03-18 11:23 GMT

Shivraj Singh Chouhan : మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ రికార్డు సృష్టించారు. అత్యధిక కాలం బీజేపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా నిలిచారు. ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం రమణ్‌సింగ్‌ నెలకొల్పిన 15 ఏళ్ల 10 రోజుల రికార్డును శివరాజ్‌సింగ్ చౌహాన్ గురువారం బద్దలు కొట్టారు. శివరాజ్‌సింగ్ చౌహాన్ గురువారం నాటికి 15 ఏళ్ల 11 రోజుల పాటు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు.

2003 డిసెంబర్ 7 నుంచి 17 డిసెంబర్ 2018 మధ్యకాలంలో ఛత్తీస్‌గఢ్ సీఎంగా పనిచేసిన రమణ్ సింగ్ 15 ఏళ్ల 10 రోజుల పాటు ఆ పదవిలో ఉన్నారు. ఇక చౌహాన్ తొలిసారిగా నవంబర్ 2005 లోముఖ్యమంత్రి అయ్యారు.. అప్పటినునుంచి 2018 వరకు సీఎంగా ఉన్నారు.. తిరిగి 2020లో ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.

ఇక భారతదేశ చరిత్రలో ఎక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రుల జాబితాలో సిక్కింకి చెందిన పవన్ కుమార్ చామ్లింగ్ (24 ఏళ్లకు పైగా), పశ్చిమ బెంగాల్‌కు చెందిన జ్యోతి బసు (23 ఏళ్లకు పైగా) మరియు అరుణాచల్‌‌ప్రదేశ్‌కి చెందిన గెగాంగ్ అపాంగ్ (22 ఏళ్లు, వరుసగా కాదు) ఉన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రులలో, ఒడిశాకు చెందిన నవీన్ పట్నాయక్ 22 సంవత్సరాల పాటు సుదీర్ఘకాలం పనిచేసిన రికార్డును కలిగి ఉన్నారు.

ఇదిలా ఉంటే బీజేపీ పార్టీ తరుపున ఎక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రులలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఒకరు. అక్టోబర్ 2001 నుంచి మే 2014 వరకు దాదాపు 13 ఏళ్ల పాటు మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.

Tags:    

Similar News