సక్సెస్ స్టోరీ: ఆరంకెల జీతాన్ని వదిలి.. ఆవులు పెంచి రూ.44 కోట్ల ఆదాయం

అమెరికాలో చేస్తున్న సాప్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలి ఆవు పాల వ్యాపారం ప్రారంభించారు.;

Update: 2021-05-19 09:46 GMT

హాయిగా కాలు మీద కాలు వేసుకుని ఏసీలో కూర్చుని చేసుకునే ఉద్యోగం ఎందుకనుకున్నారు. అమెరికాలో చేస్తున్న సాప్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలి ఆవు పాల వ్యాపారం ప్రారంభించారు. వ్యవసాయదారుల కుటుంబమైన నాన్న బాగా చదివించాడు. తాను కూడా తండ్రి నమ్మకాన్ని వమ్ము చేయకూడదని ఐఐటీ ఖరగపూర్ నుండి ఇంజనీరింగ్ పట్టాపుచ్చుకున్నారు.

పై చదువుల కోసం స్టేట్స్ వెళ్లారు. అక్కడే మాస్టర్ డిగ్రీ, పీహెచ్ డీలను అభ్యసించారు. చివరకు ఓ పెద్ద సాప్ట్ వేర్ కంపెనీలో ఆరంకెల జీతం వచ్చే ఉద్యోగం వచ్చింది. అయినా ఎందుకో సంతృప్తి కలగలేదు కిషోర్ ఇందుకూరికి. సాధారణ జీవితం గడపాలని యూఎస్ లో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి భారతదేశానికి తిరిగి వచ్చారు.

తన స్వస్థలమైన కర్ణాటకకు చేరుకున్నారు. సుమారు ఆరు సంవత్సరాలు ఇంటెల్ లో పని చేసిన ఆయన సొంతంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకున్నారు. పాడి పరిశ్రమను ప్రారంభించాలనే ఆలోచనతో కేవలం 20 ఆవులతో 2012లో పాడి పరిశ్రమను ప్రారంభించారు.

సేంద్రియ పాలను నేరుగా వినియోగదారులకు అందించాలనుకున్నారు. పాలు పితికే సమయం నుంచి అవి వినియోగదారులకు చేరే వరకు నిల్వ వుండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.

2018 నాటికి, తన కుమారుడు సిధార్థ్ పేరు మీద "సిద్స్ ఫార్మ్" అని పేరు పెట్టిన కిషోర్ డెయిరీ ఫామ్‌లో 6,000 మంది కస్టమర్లు ఉన్నారు. హైదరాబాద్ పరిసరాల్లో ఈ పాల పాకెట్లను వినియోగదారుల ఆర్డర్ మేరకు పంపిణీ చేస్తున్నారు.

షాబాద్‌లోని అతని పొలం 120 మంది ఉద్యోగులతో విస్తరించి దాదాపు రూ .44 కోట్ల వార్షిక ఆదాయాన్ని సాధించింది. అతను సేంద్రీయ పాలను మాత్రమే కాకుండా, పెరుగు, నెయ్యి వంటి పాల ఉత్పత్తులను కూడా విక్రయిస్తారు. సిద్ ఫార్మ్ ఇప్పుడు రోజుకు దాదాపు 10,000 మంది వినియోగదారులకు పాలను అందిస్తుంది.

Tags:    

Similar News