Snake Bite: పాము కరిచి అన్న మృతి.. అంత్యక్రియలకు వచ్చిన తమ్ముడు కూడా పాము కాటుకు బలి
Snake Bite: కొన్ని వినడానికి చాలా విచిత్రంగా ఉంటాయి.. పాము పగ పన్నెండేళ్లు ఉంటుందని సినిమాల్లో, కథల్లో చూస్తాము, చదువుతాము.. కానీ ఈ సంఘటన చూస్తే అది నిజమేనేమో అని అనిపిస్తుంది..;
Snake Bite: కొన్ని వినడానికి చాలా విచిత్రంగా ఉంటాయి.. పాము పగ పన్నెండేళ్లు ఉంటుందని సినిమాల్లో, కథల్లో చూస్తాము, చదువుతాము.. కానీ ఈ సంఘటన చూస్తే అది నిజమేనేమో అని అనిపిస్తుంది.. ఉత్తరప్రదేశ్ లక్నో భవానీపూర్ గ్రామంలో ఓ దురదృష్టకర సంఘటన చోటు చేసుకుంది.
గోవింద్ మిషారా (22) అనే వ్యక్తి భవానీపూర్ గ్రామంలో బుధవారం జరిగిన తన సోదరుడు అరవింద్ మిశ్రా (38) అంత్యక్రియలకు హాజరయ్యాడు. సోదరుడు అరవింద్ మంగళవారం పాముకాటుతో మృతి చెందడంతో బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబసభ్యులు.
సోదరుడి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వచ్చిన వ్యక్తి కార్యక్రమాలు పూర్తవడంతో విశ్రమించాడు.. నిద్రలోకి జారుకున్నాడు.. కానీ అతడు నిద్రలో ఉండగానే అతడిని కూడా పాము కరిచింది. దాంతో అతడు కూడా మృతి చెందాడు. కుటుంబంలోని మరో వ్యక్తి చంద్రశేఖర్ పాండే (22) కూడా పాము కాటుకు గురయ్యాడు. దాంతో అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు వైద్యులు.
వైద్య, పరిపాలన శాఖ ఉన్నతాధికారులు గురువారం గ్రామాన్ని సందర్శించారు. స్థానిక ఎమ్మెల్యే కైలాష్ నాథ్ శుక్లా దుఃఖంలో ఉన్న కుటుంబాన్ని పరామర్శించి వారికి సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను శుక్లా కోరారు.