Malvika Sood : కాంగ్రెస్ పార్టీలో చేరిన సోనుసూద్ సోదరి
Malvika Sood : ప్రముఖ నటులు, దాత, సామాజిక సేవకులు సోనుసూద్ కుటుంబం కాంగ్రెస్ పార్టీలో చేరింది.;
Malvika Sood : ప్రముఖ నటులు, దాత, సామాజిక సేవకులు సోనుసూద్ కుటుంబం కాంగ్రెస్ పార్టీలో చేరింది. సోనుసూద్ సోదరి మాల్వికా సచార్.. పంజాబ్ సీఎం చన్నీ, పీసీసీ చీఫ్ సిద్దూ సమక్షంలో కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్నారు. మొగాలోని సోనుసూద్ నివాసానికి వెళ్లిన సీఎం చన్నీ, సిద్దూ..మాల్వికాను పార్టీలోకి ఆహ్వానించారు. సోనుసూద్ సామాజిక సేవలో కీలక భూమిక పోషించిన మాల్విక కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని పంజాబ్‌లో గేమ్ ఛేంజర్‌గా అభివర్ణించారు సిద్దు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తామని మాల్వికా తెలిపారు. కాగా.. ఫిబ్రవరి 14న జరగబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాల్వికా.. మొగ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు.