Tamil Nadu Rains: తమిళనాడులో భారీ వర్షాలు.. ఇబ్బందులు పడ్డ ప్రజలు.. నేనున్నానంటు ప్రభుత్వం భరోసా..

Tamil Nadu Rains: తమిళనాడును భారీ వర్షం ముంచెత్తింది. ఏకదాటిగా కురిసిన వర్షానికి చెన్నై నీట మునిగింది.

Update: 2021-11-08 01:32 GMT

Tamil Nadu Rains (tv5news.in)

Tamil Nadu Rains: తమిళనాడును భారీ వర్షం ముంచెత్తింది. ఏకదాటిగా కురిసిన వర్షానికి చెన్నై నీట మునిగింది. నగరంలోని లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 2015 తర్వాత చెన్నైలో ఇదే అత్యధిక వర్షపాతం. అన్నా నగర్, T-నగర్, చోలై, KKనగర్ సహా పలు కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. రోడ్లన్ని చెరువులను తలపించాయి.

పలు చోట్ల మోకాళ్ల లోతులో నీళ్లు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వెలచెరిలోని నివాస ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో కార్లన్నింటిని ఫ్లై ఓవర్ పై పార్క్ చేశారు. T-నగర్ లోని సబ్ వే జలమయమైంది. పడవల సాయంతో స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చెంగల్‌పట్టు తిరవళ్లూరులు, మధురైలో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహయకచర్యల్లో కొనసాగిస్తున్నాయి.

కన్యాకుమారి, కాంచీపురంలో భారీ వర్షాలు కురవడంతో.. విద్యుత్‌ సరఫరాను నిలిపేశారు. చెన్నైలో మోకాలు లోతు నీటిలో వాహనాలు రాకపోకలు సాగించాయి. లోకల్‌ రైళ్లను రద్దు చేసింది రైల్వేశాఖ. చెంబక్కరపాకం, పుళల్‌ రిజర్వాయర్లు నిండుకుండలా మారాయి. పూళల్ డ్యాం పూర్తి స్థాయిలో నిండడంతో దిగువకు 500 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు సీఎం స్టాలిన్. పెరంబూర్ బరాక్స్ రోడ్, ఒట్టెరి బ్రిడ్జి, పాడి, ఎగ్మోర్, జవహర్ నగర్ ఏరియాల్లో పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియాలో చేపట్టాల్సిన సహాయక చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సహాయక సామాగ్రి పంపిణీ చేశారు.

చెన్నైతో పాటు కంచిపురం, తిరవల్లూర్, చెంగల్ పేట్ జిల్లాల్లో స్కూల్స్ కు ఇవాళ , రేపు సెలవులు ప్రకటించారు. చెన్నైకి వచ్చేవారు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలన్నారు. తమిళనాడులోని పలు జిల్లాల్లో మరికొన్ని రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. చెన్నై సహా, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్‌పట్టు, రాణిపేట్‌, తిరపత్తూరు, కృష్ణగిరి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.

Tags:    

Similar News