Piyush Goyal : తెలంగాణలో ఉత్పత్తి అయిన ధాన్యం మొత్తం కొనలేం: కేంద్రం
Piyush Goyal : ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం మరోసారి కుండబద్దలు కొట్టింది. రాష్ట్రంలో ఉత్పత్తి అయిన ధాన్యం, బియ్యం మొత్తాన్ని కొనలేమని తేల్చి చెప్పింది.;
Piyush Goyal : ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం మరోసారి కుండబద్దలు కొట్టింది. రాష్ట్రంలో ఉత్పత్తి అయిన ధాన్యం, బియ్యం మొత్తాన్ని కొనలేమని తేల్చి చెప్పింది. లోక్ సభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమాధానమిచ్చారు. ఆయా రాష్ట్రాల్లో ఉత్పత్తుల ఆధారంగా కొనుగోలు చేయలేని... ధర, డిమాండ్, సరఫరా పరిస్థితుల ఆధారంగా కొనుగోళ్లు జరుగుతాయన్నారు. ఇదిలా ఉంటే... రాష్ట్రంలో పండిన మొత్తం ధాన్యాన్ని కొనాలని తెలంగాణ పట్టుబడుతోంది. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న తెలంగాణ మంత్రులు, ఎంపీలు... కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అపాయింట్ మెంట్ కూడా కోరారు. తెలంగాణలో యాసంగిలో పండే మొత్తం వరి ధాన్యాన్ని కొనాలని డిమాండ్ చేస్తున్నారు.