80 ఏళ్ళు పై బడిన వారికి నో టికెట్.. 291 మంది అభ్యర్ధుల జాబితా రిలీజ్ చేసిన మమతా బెనర్జీ..!
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆ రాష్ట్ర సీఎం మమతాబెనర్జీ... తమ పార్టీ అభ్యర్ధుల జాబితాను విడుదల చేశారు. మొత్తం 291 మంది అభ్యర్ధుల జాబితా రిలీజ్ చేశారామె.;
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆ రాష్ట్ర సీఎం మమతాబెనర్జీ... తమ పార్టీ అభ్యర్ధుల జాబితాను విడుదల చేశారు. మొత్తం 291 మంది అభ్యర్ధుల జాబితా రిలీజ్ చేశారామె. ఇందులో 50 మంది మహిళలకు సీట్లు కేటాయించారు. 79 మంది ఎస్సీలు, 42 మంది మైనార్టీలకు టికెట్లు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో తాను నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు మమత బెనర్జీ. ప్రస్తుతం ఆమె భవానీపూర్ నుంచి ప్రాతినిధ్యం వస్తున్నారు. అటు... ఇటీవల టీఎంసీలో చేరిన క్రికెటర్ మనోజ్ తివారీకి టికెట్ ఇచ్చారు. ఇతను.. షిబిపూర్ నుంచి పోటీ చేయనున్నారు. ఇక ఈసారి పలువురు సిట్టింగ్‌లకు టికెట్లు ఇవ్వలేదు మమతాబెనర్జీ.... కాగా ఎన్నికల్లో పోటి చేసే అభ్యర్దులను ప్రకటించిన మమతా.. 80 ఏళ్ళు పై బడిన వారికి మాత్రం టికెట్ కేటాయించలేదు.