Beggar Corporation: వాళ్లిప్పుడు బిచ్చగాళ్లు కాదు వ్యాపారులు.. దానం చేయకండి..
Beggar Corporation: తానే బెగ్గర్ కార్పొరేషన్ పేరుతో ఓ స్టార్టప్‌ని పెట్టి యాచకులకు పునరావాసంతో పాటు ఉపాధి కల్పిస్తున్నారు.;
Beggar Corporation: కాలు, చెయ్యి బాగానే ఉందికదా ఎందుకు అడుక్కుంటున్నావు.. ఏదో ఒక పని చేసుకుని బతకొచ్చుగా అలవాటుగా అనేస్తాం.. సిగ్నల్ దగ్గర బిచ్చమెత్తుకుంటున్న యాచకుల్ని చూసి.. అనేవాళ్లే కానీ పనిచ్చేవాళ్లు ఎవరూ బాబు అనడం పరిపాటి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సామాజిక కార్యకర్త మిశ్రా మాత్రం అందరిలా అనలేదు..
తానే బెగ్గర్ కార్పొరేషన్ పేరుతో ఓ స్టార్టప్‌ని పెట్టి యాచకులకు పునరావాసంతో పాటు ఉపాధి కల్పిస్తున్నారు. ప్రారంభించిన తొలినాళ్లలోనే 12 యాచక కుటుంబాల నుంచి 55 మందిని ఎంచుకుని వారికి వివిధ అంశాల్లో శిక్షణ ఇప్పించారు. బ్యాగులు తయారు చేసి మార్కెట్ చేస్తున్నారు.
దానం చేస్తే పుణ్యం వస్తుందని భావించి చాలా మంది యాచకులకు డబ్బులిస్తుంటారు.. అలా కాకుండా వారికి ఉపాధి అవకాశం కల్పిస్తే వాళ్ల కాళ్ల మీద వారు బతుకుతారు అని అంటారు మిశ్రా. ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన బెగ్గర్ కార్పొరేషన్‌కు మంచి ఆదరణ లభించడంతో దానిని ఆదాయ వనరున్న కంపెనీగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో రూ.2.5 కోట్ల పెట్టుబడులు సేకరించేందుకు మిశ్ర ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రభుత్వం తమకు అనుమతిస్తే.. యాచకులను గుర్తించి పిల్లల్ని, వృద్ధుల్ని పునరావాస కేంద్రాలకు పంపిస్తాము. 18-45 ఏళ్ల వయసున్న వారికి మూడు నెలలు శిక్షణ ఇచ్చి, రుణాలు మంజూరు చేయించి వ్యాపారం ప్రారంభించేలా చేస్తామని ట్రస్ట్ నిర్వాహకులు అంటున్నారు.
అంతేకాకుండా యాచకుల పిల్లలు చదువుకునేందుకు వారణాలసిలోనే స్కూల్ ఆఫ్ లైఫ్ పేరుతో ఓ పాఠశాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో 32 మంది చిన్నారులు విద్యనభ్యసిస్తున్నారు.