మమతకి మరో షాక్.. మంత్రి పదవికి కీలక నేత రాజీనామా!

త్వరలో పశ్చిమబెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వరుసగా షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి.

Update: 2021-01-22 09:30 GMT

త్వరలో పశ్చిమబెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వరుసగా షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బీజేపీలో చేరిపోతున్నారు. ఇప్పటికే టీఎంసీ ఎంపీ సువేందు అధికారి బీజేపీలో చేరారు. ఆయన నేతృత్వంలో మరో ఏడుగురు తృణమూల్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్‌ అయ్యారు.

తాజాగా కేబినెట్‌ మంత్రి రాజీవ్ బెనర్జీ తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని అయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. రాజీవ్ బెనర్జీ దోంజూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేబినేట్ లో అటవీశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. అయితే గత కొంతకాలంగా పార్టీ పైన అసమ్మతిని వ్యక్తం చేస్తున్న ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారు.

ఈ క్రమంలో అయన బీజేపీలో చేరుతారనే ఉహాగానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షా మరోసారి బెంగాల్ పర్యటనకు ముందు రాజీవ్‌ రాజీనామా చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 

Tags:    

Similar News