Punjab : లూడో గేమ్‌లో పరిచయం.. భర్త, పిల్లల్ని వదిలేసి.. చివరికి ఇలా..!
లూడో గేమ్‌లో పరిచయమైన ఓ యువకుడి కోసం కట్టుకున్న భర్తను, కన్నపిల్లల్ని వదిలేసి ఏకంగా సరిహద్దులు దాటి వెళ్లేందుకు సిద్దమైంది ఓ మహిళ..
లూడో గేమ్‌లో పరిచయమైన ఓ యువకుడి కోసం కట్టుకున్న భర్తను, కన్నపిల్లల్ని వదిలేసి ఏకంగా సరిహద్దులు దాటి వెళ్లేందుకు సిద్దమైంది ఓ మహిళ.. కానీ చివరికి పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో కథ మొత్తం అడ్డం తిరిగింది. ఈ ఘటన పంజాబ్‌లో చోటు చేసుకుంది.
రాజస్థాన్‌కు చెందిన సదరు మహిళకు లూడో గేమ్ ఆడే అలవాటుంది. అలా పాకిస్థాన్‌కు చెందిన ఓ టీనేజర్‌తో 12 రోజుల క్రితం పరిచయం ఏర్పడింది.. ఆ తర్వాత ఫేస్‌బుక్ మరియు వాట్సాప్‌లో కనెక్ట్ అయ్యింది. ఆ పరిచయం కాస్త ప్రేమకి దారి తీసింది. దీనితో అతనితో బ్రతకాలని అమె నిర్ణయం తీసుకుంది.
ఈ క్రమంలో అతని దగ్గరికి వెళ్లిపోవాలని డిసైడ్ అయింది. అందులో భాగంగానే ఇంటినుంచి పంజాబ్‌కు చేరుకొంది.. అక్కడినుంచి అమృత్‌సర్‌లో ఉన్న ఆమెకు వాఘా సరిహద్దుకు రావాలని అమె ప్రియుడు చెప్పాడు. ఆమె ఓ ఆటో కూడా మాట్లాడుకుంది. అయితే వీరి సంభాషణ ఆటో డ్రైవర్‌కి అనుమానం కలిగించింది.
అతను పోలీసులకి సమాచారం ఇవ్వడంతో చివరి నిమిషంలో మొత్తం కథ అడ్డం తిరిగింది. ఆమెను అడుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆమె కుటుంబ సభ్యులకి సమాచారం ఇచ్చారు. ఆమె వద్ద డబ్బు, బంగారం ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు.