Saudi Arabia: అక్కడ సమోసాలు ఇలా తయారు చేస్తున్నారా..! ఏకంగా వాష్ రూమ్‌లోనే..
Saudi Arabia: సౌదీ అరేబియాలో రెస్టారెంట్.. వాష్ రూమ్‌లోనే ఆహార పదార్థాల తయారీ చేస్తున్నట్టు అధికారులకు సమాచారం అందింది.;
Saudi Arabia: స్ట్రీట్ ఫుడ్ అంటే ఈమధ్య చాలామంది అమితంగా ఇష్టపడి తింటున్నారు. క్షణాల్లో అయిపోయే ఫాస్ట్ ఫుడ్‌కు అయితే మరీ ఎక్కువగా ప్రాధాన్యత ఉంది. అందులో సమోసా కూడా ఒకటి. అయితే స్ట్రీట్ ఫుడ్ అంటే శుభ్రంగా ఉండదని, నాణ్యత లోపాలు ఉంటాయని కొందరి వాదన. నిజంగానే ఆ హోటల్‌లో సమోసా తయారీ చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. అంతే కాకుండా కాస్త వికారంగా కూడా అనిపిస్తుంది.
సౌదీ అరేబియాలో జెబ్బా నగరంలోని రెసిడెన్షియల్ భవనంలోని రెస్టారెంట్ వాష్ రూమ్‌లోనే ఆహార పదార్థాల తయారీ చేస్తున్నట్టు అధికారులకు సమాచారం అందింది. దీంతో అధికారులు ఆ రెస్టారెంట్‌ను తనిఖీ చేశారు. అక్కడ వారు ఆశ్చర్యపోయే విషయం బయటపడింది. ఇప్పుడే కాదు గత 30 ఏళ్లుగా వారు సమోసాలను వాష్ రూమ్‌లోనే తయారు చేస్తున్నట్టు తెలిసింది.
అంతే కాకుండా ఆ రెస్టారెంట్‌లో మాంసంతో పాటు ఇంకా చాలా వస్తువులు కుళ్లిపోయినట్టు అధికారులు గమనించారు. అయితే కొన్ని ఆహార పదార్థాలు రెండేళ్ల కిందటివి కూడా ఉన్నట్టు సమాచారం. దీంతో రెస్టారెంట్ అంతా పురుగులు, ఎలుకలు, బొద్దింకలు కూడా తిరుగుతున్నాయి. ఈ ఒక్క రెస్టారెంట్ మాత్రమే సౌదీలో చాలా రెస్టారెంట్లు నాణ్యత లోపం వల్ల ఇటీవల కాలంలో మూతబడ్డాయి.