Air India Fire : రన్‌వే పైనే మంటలు.. తప్పిన పెను ప్రమాదం..
Air India Fire : మస్కట్‌లో విమాన ప్రమాదం తప్పింది;
Air India Fire : మస్కట్‌లో విమాన ప్రమాదం తప్పింది. ఎయిర్ ఇండియా విమానంలో సడన్‌గా మంటలు చెలరేగాయి. టేకాఫ్ సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది విమానాన్ని రన్‌వేపై నిలిపి, ప్రయాణికులను ఎమర్జెన్సీ వే ద్వారా కిందికు దించారు. ప్రమాద సమయంలో విమానంలో 141మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.