ISIS Syria : అమెరికా మిలిటరీ డ్రోన్ దాడిలో.. సిరియా ఐసిస్ ఛీఫ్ మృతి..
ISIS Syria : ఐసిస్ సంస్థకు సిరియా ఛీఫ్ మహెర్ అల్ అగల్ ను కొన్ని గంటల ముందు అమెరికా డ్రోన్ల సాయంతో హతమార్చింది;
ISIS Syria : ఐసిస్ ఉగ్రవాద సంస్థకు సిరియా ఛీఫ్‌గా వ్యవహరిస్తున్న మహెర్ అల్ అగల్ ను కొన్ని గంటల ముందు అమెరికా డ్రోన్ల సాయంతో హతమార్చింది. మహెర్ సిరియాలోని జిండెరిస్‌లో బైక్‌పై వెళ్తుండగా అమెరికా సేనలు అటాక్ చేశాయి. అతనితో పాటు మరో టాప్ లీడర్ తీవ్ర గాయాలపాలైనట్లు పెంటగన్ సెంట్రల్ కమాండ్ స్పోక్స్‌పర్సన్ లెఫ్టనెంట్ కల్‌నల్ దేవ్ ఈస్ట్‌బర్న్ స్పష్టం చేశారు.
ఐసిస్ ఉగ్రవాద సంస్థ టాప్ లీడర్‌లను అమెరికా సేనలు ఒక్కక్కరినీ ఏకిపారేస్తున్నా కూడా ఆ స్థానంలో మరొకరు వస్తునే ఉన్నారు. 5 నెలల క్రితం ఐసిస్ ప్రధాన నాయకుల్లో ఒకరైన అబు ఇబ్రహీం అల్ ఖురేషిని కూడా అమెరికా సేనల చేతిలో చంపబడ్డాడు.