Afghanistan: ఆప్ఘనిస్థాన్‌లో సిక్కు మైనార్టీలపై దాడి.. ఇద్దరు మృతి..
Afghanistan: తాలిబన్ పాలనలో ఉన్న ఆప్ఘనిస్థాన్‌లో సిక్కు మైనార్టీలపై దాడి జరిగింది.;
Afghanistan: తాలిబన్ పాలనలో ఉన్న ఆప్ఘనిస్థాన్‌లో సిక్కు మైనార్టీలపై దాడి జరిగింది. రాజధాని కాబూల్‌లోని ప్రముఖ కార్తే పర్వాన్ గురుద్వార్‌పై ఉగ్రవాదులు బీకర దాడులు చేశారు. రెండు సార్లు పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లో ఇద్దరు చనిపోగా.. మరికొందరూ తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దాడి జరిగిన సమయంలో గురుద్వారాలో 30 మంది ఉన్నట్లు తెలుస్తోంది.
ఎంతమంది ప్రాణాలు కోల్పాయారన్న స్పష్టత రావాల్సింది. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని ఆఫ్గన్ భద్రతా దళాలు.. తమ ఆధీనంలో తీసుకున్నాయి. ఈ పేలుళ్లలో.. గురుద్వారా పూర్తిగా ధ్వంసమైంది.కాబూల్ సిటీలో కార్తే పర్వాన్ గురుద్వారా సిక్కుల ప్రధాన ప్రార్థనాల్లో ఒకటి. ఈ గురుద్వారాను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది.
బాంబు పేలుళ్లతో పాటు తుపాకీ పేలుళ్లు సైతం వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. గురుద్వారా తగలబడుతూ.. భారీ ఎత్తున పొగలు బయటికి వస్తున్న దృశ్యాలు.. వైరలయ్యాయి. ఈ దాడుల్ని ఖండించిన భారత విదేశాంగ శాఖ.. దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇది పిరికిపందల చర్యగా అభివర్ణించారు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్.
పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామన్నారాయన. మరోవైపు ఇది ఆత్మాహుతి దాడిగా అనుమానిస్తున్నారు. ఇది ఐసీస్ ఉగ్రమూకల దుశ్చర్య కావొచ్చంటున్నారు. గత ఏడాది తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత వరుసగై మైనార్టీ లక్ష్యంగా ఐసిస్ దాడులకు తెగబడుతోంది. షియా, హజారా వర్గాలపై దాడులు చేసింది. ఇప్పుడు హిందూ, సిక్కులపై దాడి చేస్తోంది.