Congo Train Accident: కాంగోలో ఘోర రైలు ప్రమాదం.. 60 మందికి పైగా మృతి..
Congo Train Accident: కాంగోలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 60 మంది చనిపోయారు.;
Congo Train Accident: కాంగోలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 60 మంది చనిపోయారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. రైలు పట్టాలు తప్పడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక మీడియా తెలిపింది. లుయెన్ నుంచి టెంకే సిటీ వైపు వెళ్తుండగా బయోఫ్వే గ్రామం వద్ద పట్టాలు తప్పింది. ప్రమాద సమయంలో రైలుకు 15 బోగీలు ఉండగా.. అందులో ఏడు రైలు బోగీలు పక్కనే ఉన్న లోయలో పడిపోయాయని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ 60 మంది మరణించారని, మరో 52 మంది గాయపడ్డారని, మృతుల సంఖ్య భారీ పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
కాంగోలో రైలు ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. గతంలోనూ రైలు పట్టాలు తప్పిన ఒక్కో ఘటనలో కనీసం 50 మంది, 60 మంది చనిపోయారు. రోడ్లు సరిగా లేకపోవడంతో దూరప్రాంతాలకు వెళ్లే వాళ్లంతా రైళ్లకే ప్రాధాన్యత ఇస్తారు. అవసరమైతే ట్రైన్ పైన కూడా కూర్చుని ప్రయాణిస్తుంటారు. చివరికి గూడ్స్ రైళ్లను కూడా వదిలిపెట్టరు. అందుకే, ఎప్పుడైనా ప్రమాదం జరిగితే ప్రాణనష్టం చాలా ఎక్కువగా ఉంటోంది.