Joe Biden: సైకిల్ పైనుంచి కిందపడ్డ అమెరికా అధ్యక్షుడు.. వెంటనే పైకి లేచి..
Joe Biden: అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ సైకిల్ తొక్కుతూ కింద పడ్డారు.;
Joe Biden: అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ సైకిల్ తొక్కుతూ కింద పడ్డారు. డెలావేర్‌లోని బీచ్ హోంకు సమీపంలో ఉన్న స్టేట్ పార్క్‌లో ఆయన భార్య, ప్రథమ మహిళ జిల్ బిడెన్ సహా మరికొందరి కుటుంబ సభ్యులతో సరదాగా సైకిల్‌పై రైడింగ్‌కి వెళ్లారు. అయితే అక్కడున్న కొందరితో మాట్లాడేందుకు ఆగిన ఆయన.. కాస్త బ్యాలెన్స్ తప్పి సైకిల్ నుంచి కింద పడ్డారు.
సైకిల్ మీద నుంచి దిగుతూ బ్యాలెన్స్ చేసుకోలేకపోవడంతో దొర్లుకుంటూ కింద పడిపోయారు. అదృష్టవశాత్తు ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. కిందపడిన వెంటనే తనంతట తానే లేచి.. బాగానే ఉన్నానని, తనకేం కాలేదని చెప్పారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
My friend just filmed Joe Biden @POTUS falling off his bike no joke. Just happened at Rehoboth Beach 😂 #JoeBiden #BidenIsAFailure #RehobothBeach #Trump #EpicFail #Biden pic.twitter.com/cVMycEwuI0
— jonboy (@jonboy79788314) June 18, 2022