Malaysia: మలేషియా మాజీ ప్రధానికి 12 ఏళ్ల జైలు శిక్ష..
Malaysia: మలేషియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్‌కు 12 ఏళ్ల జైలు శిక్ష ఖరారైంది.;
Malaysia: మలేషియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్‌కు 12 ఏళ్ల జైలు శిక్ష ఖరారైంది. అవినీతి కేసులో మలేసియా మాజీ ప్రధానిని దోషిగా తేలుస్తూ ఆ దేశ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. దీంతో మాజీ ప్రధానుల్లో చెరసాలకు వెళ్తున్న తొలి వ్యక్తిగా నజీబ్ అప్రతిష్ట మూటగట్టుకోనున్నారు. దోషిగా నిర్ధారణ కావడంతో ఆయనకు హైకోర్టు గతంలోనే 12 ఏళ్ల కారాగార శిక్ష విధించింది.
'ఆయన చేసిన అధికార దుర్వినియోగం, నమ్మకద్రోహం, మనీ లాండరింగ్ నేరాలకు తగిన శిక్షే ఇదేనని హైకోర్టు తీర్పును ఫెడరల్ కోర్టు సమర్ధించింది. వెంటనే ఆయన తన జైలుజీవితం మొదలుపెట్టాలని ఆదేశించింది. మలేషియా అభివృద్ధికి ఉద్దేశించిన మలేషియా డెవలప్‌మెంట్ బెహ్రాత్ నుంచి ఏకంగా 450 కోట్ల అమెరికన్ డాలర్లను నజీబ్ దోచుకున్నారని దర్యాప్తులో తేలింది. SRC ఇంటర్నేషనల్ నుంచి మరో 94 లక్షల డాలర్లు అక్రమంగా పొందారని తేలింది.