Mark Zuckerberg: 24 గంటల్లో 29 బిలియన్ డాలర్లు పోగొట్టుకున్న మార్క్ జుకర్‌బర్గ్..
Mark Zuckerberg: ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్-10లో ఉన్న మార్క్‌జుకర్‌బర్గ్ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.;
Mark Zuckerberg (tv5news.in)
Mark Zuckerberg: ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్-10లో ఉన్న మార్క్‌జుకర్‌బర్గ్ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. మెటా సంస్థ షేర్లు రికార్డు స్థాయిలో 26.4శాతం పతనమవ్వడంతో.. 24 గంటల్లోనే 29 బిలియన్డాలర్ల జుకర్‌బర్గ్ సంపద ఆవిరైంది. చరిత్రలో నమోదైన అత్యంత భారీ నష్టాల్లో ఇది రెండోది. అంతకు ముందు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఒక్కరోజులోనే 35 బిలియన్ డాలర్లు పోగొట్టుకున్నారు.
సోషల్ మీడియా దిగ్గజ ప్లాట్‌ఫామ్ ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా షేర్లు.. ఒక్కరోజులోనే 26.4 శాతం క్షీణించడం.. మార్కెట్ వర్గాల్లో ఆందోళన కలిగించింది. మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన తర్వాత ఈ పతనం జరిగింది. అమెరికా స్టాక్ మార్కెట్ నాస్‌డాక్‌లో ఫేస్‌బుక్ షేర్లు 26.4 శాతం పతనమవ్వడంతో.. 230 బిలియన్ డాలర్ల సంపద ఆవిరైపోయింది.
మన కరెన్సీ ప్రకారం సుమారు లక్షా 72వేల కోట్లు తరిగిపోయాయి. దీంతోపాటు డెయిలీ యాక్టివ్ యూజర్ల సంఖ్య కూడా భారీగా తగ్గిపోయింది. 18 సంవత్సరాల తరువాత తొలిసారిగా.. ఫేస్‌బుక్ డెయిలీ యాక్టివ్ యూజర్ల సంఖ్య తగ్గింది. ఈ పతనం దెబ్బతో మెటా వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ వ్యక్తిగత సంపద హరించుకుపోయింది. మొత్తం 31 బిలియన్ డాలర్ల మేర ఆస్తులు ఆవిరయ్యాయి.
ఆయన కోల్పోయిన ఆస్తుల విలువ ఓ యూరప్ దేశ స్థూల జాతీయోత్పత్తితో సమానం. మెటాలో పెట్టుబడి పెట్టిన వారు, షేర్ల కొనుగోలుదారులు, రిటైల్ ఇన్వెస్టర్లు ఘోరంగా నష్టపోయారు. ఈ మహాపతనంతో మార్క్ జుకర్‌బర్గ్ సంపద 85 బిలియన్ డాలర్లకు చేరింది. ఫలితంగా భారత పారిశ్రామిక దిగ్గజాలు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీలు జుకర్‌బర్గ్ కంటే కుబేరులయ్యారు.
ఫోర్బ్స్ జాబితా ప్రకారం.. ముఖేష్ అంబానీ సంపద 90.1 బిలియన్ డాలర్లు, గౌతమ్ అదానీ ఆస్తుల విలువ 90 బిలియన్ డాలర్లు ఉంది. ఈ ప్రకారం వీరు జుకర్‌బర్గ్ కంటే అయిదు బిలియన్ డాలర్లు అధిక సంపద కలిగివున్నారు. మూడో త్రైమాసికం ఫలితాల్లో స్వల్పంగా నష్టాలను చూపించడమే.. మెటా కంపెనీ షేర్ల ఘోర పతనానికి కారణమై ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
డెయిలీ యాక్టివ్ యూజర్ల సంఖ్య తగ్గడానికి చైనాకు చెందిన వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్ కారణమని మెటా మైటా యాజమాన్యం అంచనా వేస్తోంది. చైనాకు చెందిన బైట్‌డాన్స్ కూడా కారణమై ఉండొచ్చని.. ఈ ప్లాట్‌ఫామ్ నుంచి ఫేస్‌బుక్ గట్టిపోటీ ఎదుర్కొంటోందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.