Mompha Junior: 9 ఏళ్లకే ప్రైవేట్ జెట్, మ్యాన్షన్.. ఆఫ్రికాలోనే రిచ్చెస్ట్ కిడ్ లైఫ్‌స్టైల్ ఇది..

Mompha Junior: బిలియన్ అంటే ఎంత అని తెలిసే వయసు కూడా కాదు తనది. కానీ బిలీనియర్ అయిపోయాడు.

Update: 2022-02-15 02:46 GMT

Mompha Junior: మామూలుగా 9 ఏళ్ల వయసున్న పిల్లలు ఏం చేస్తారు. స్కూళుకు వెళ్లి చదువుకొని, అక్కడ చెప్పిందే మళ్లీ ఇంటికి వచ్చి చదివి కాసేపు ఆటలు ఆడుకుంటారు. మామూలు మిడిల్ క్లాస్ పిల్లాడి లైఫ్ ఇలాగే ఉంటుంది. అదే కాస్త రిచ్ అయితే.. ఇంట్లో వారితో ఎక్కువగా బయటికి వెళ్లే సౌకర్యం ఉంటుంది. కానీ 9 ఏళ్ల పిల్లాడికి మాత్రమే సెపరేట్‌గా మ్యాన్షన్, ప్రైవేట్ జెట్ ఉంటే ఎలా ఉంటుంది. మోంఫా జూనియర్ జీవితంలాగా ఉంటుంది అనేది ఈ కథ తెలిసినవారి సమాధానం.

బిలియన్ అంటే ఎంత అని తెలిసే వయసు కూడా కాదు తనది. కానీ బిలీనియర్ అయిపోయాడు. ముహమ్మద్ అవల్ ముస్తఫా ఆకా మోంఫా జూనియర్ తండ్రి నైజీరియన్ ఇంటర్నెట్ సెలబ్రిటీ ఇస్మాలియా ముస్తఫా. అతడు చాలా చిన్న వయసు నుండే తన కొడుకు మోంఫాకు చాలా లగ్జరీ జీవితాన్ని అందజేశాడు. ఆరేళ్ల వయసు నుండే మోంఫా ప్రైవేట్ జెట్‌లో తిరగడం మొదలుపెట్టాడు.

మోంఫా జూనియర్ కేవలం బ్రాండెడ్ బట్టలు, గడియారాలు, బూట్లు ధరిస్తాడు. అంతే కాకుండా తన పేరుపై పెద్ద మ్యాన్షనే ఉంది. కొంతమంది తమ జీవితమంతా కష్టపడినా అలాంటి మ్యాన్షన్‌ను కట్టలేరు. కానీ మోంఫా జూనియర్ ఆరేళ్ల వయసులోనే దీనికి అధిపతి అయ్యాడు.

మోంఫా జూనియర్‌కు, తన తండ్రికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ కూడా ఉంది. 9 ఏళ్ల వయసులోనే మోంఫా గడుపుతున్న విలాసవంతమైన జీవితం వల్ల తాను ప్రపంచంలోనే మోస్ట్ లగ్జరీ కిడ్‌గా పేరు సంపాదించుకున్నాడు.

Tags:    

Similar News