Shinzo Abe_ Modi: ఇదే తనతో నా చివరి ఫోటో: షింజో అబె మరణంపై మోదీ ట్వీట్..

Shinzo Abe_ Modi: షింజో అబెతో భారత్ అనుబంధం మరువలేనిది

Update: 2022-07-08 10:23 GMT

Shinzo Abe_ Modi: జపాన్ మాజీ ప్రధాని షింజో అబెను ఓ ఆగంతకుడు కాల్చి చంపడం ప్రపంచమొత్తాన్ని విస్మయానికి గురిచేసింది. జపాన్‌కు సుదీర్ఘకాలంగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు షింజో అబె. దాదాపు తన జీవితం మొత్తం జపాన్‌ను మరింత అభివ‌ృద్ధి పధంలో నడిపించేందుకు తన శాయశక్తులా కృషి చేశారు. భారతదేశానికి షింజో అబెకు అవినాభావ సంబంధాలున్నాయి. షింజో అబె తాత నోబుసుకె కిషి జవహర్‌లాల్ నెహ్రూ కాలంలో జపాన్‌కు ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.

కేంద్ర ప్రభుత్వం షింజో అబెకు 2021లో పద్మ విభూషన్ అవార్డుతో సత్కరించింది. షింజో అబెపై కాల్పులు జరగ్గానే ప్రధాని మోదీ దిగ్భ్రాంతికి లోనయి ట్వీట్ చేశారు. 2015లో ప్రధాని మోదీతో కలిసి వారణాసిని సందర్శించారు. అక్కడ గంగా హారతిని వీక్షించారు. రెండేళ్ల తరువాత అహ్మదాబాద్‌లో దేశంలోనే మొదటి బులెట్ ట్రైన్‌‌కు శంకుస్థాపన చేశారు. 2018లో ప్రధాని మోదీని హాలిడే విందుకు షింజోను తన ఇంటికి ఆహ్వానించారు.

ప్రధాని మోదీ ఎన్నో సార్లు షింజో అబె తన క్లోజ్ ఫ్రెండ్‌ అంటూ ప్రకటించారు. షింజో అబె సైతం మోదీ తన ఆత్మీయ మిత్రుడు అని గుర్తుచేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉందనేదానితో సంబంధం లేకుండా భారతదేశంలో బలమైన అభివృద్ధికరమైన సంబంధాలను కొనసాగించారు. న్యూక్లియర్ ఎనర్జీ, ద్వైపాక్షిక సంబంధాలు, ఇన్ఫ్రా‌స్ట్రక్చర్, ఇండో పెసఫిక్ సముద్ర పరివాహక భద్రత లాంటి విషయాల్లో జపాన్ భారత‌్‌కు ఎప్పుడూ సహకరిస్తూనే ఉంది. 


Tags:    

Similar News