Rishi Sunak Twitter : "అందుకోసమే రాజకీయాల్లోకి వచ్చాను"... రిషి సునక్ ఎమోషనల్ ట్వీట్..

Rishi Sunak Twitter : ప్రవాస భారతీయుడు.. ఇంగ్లాండ్ ప్రభుత్వ మాజీ మంత్రి రిషి సునక్ ఆ బ్రిటన్ ప్రధాని పదవికి పోటీచేయనున్నారు

Update: 2022-07-08 16:31 GMT

Rishi sunak Twitter : ప్రవాస భారతీయుడు.. ఇంగ్లాండ్ ప్రభుత్వ మాజీ మంత్రి రిషి సునక్ బ్రిటన్ ప్రధాని పదవికి పోటీచేయనున్నారు. దీనికి సంబంధించిన మొదటి క్యాంపెయిన్ వీడియోను ఆయన ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశారు. ఈ వీడియోలో రిషి గ్రాండ్ పేరెంట్స్ ఇంగ్లాండ్‌కు ఎలా వచ్చారు, ఉద్యోగం సంపాదించడానికి ఎంత కష్టపడ్డారనే విషయాలను వివరించారు. తన కుటుంబం, విద్యా, పొలిటికల్ కెరీర్ గురించి డిటెయిల్డ్‌గా ఇంట్రెస్టింగ్‌గా రిలీజ్ చేశారు. బ్రిటన్‌ను తిరిగి నిర్మిద్దాం, తిరిగి బలంగా తయారు చేద్దాం నాకు మద్దతిచ్చి ప్రధానిగా చేయండి అనంటూ ఆయన క్యాంపెయిన్ వీడియోను పోస్ట్ చేశారు.

రిషి సునక్ గ్రాండ్ పేరెంట్స్ పంజాబ్‌కు చెందిన వారు. 1960 కాలంలో రిషి నానమ్మ ఫార్మసిస్ట్‌గా ఇంగ్లాండ్‌కు వచ్చారు. 8 ఏళ్ల తరువాత మొత్తం కుటుంబం ఇంగ్లాండ్‌లోనే సెటిల్ అయిందన్నారు. బ్రిటన్ తన కెరీర్ ఎదుగుదలకు ఎంతో సహకరించిందన్నారు. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి కూతురు అక్షత మూర్తితో రిషి సునక్‌కు వివాహం అయింది వారికి ఇద్దరు పిల్లలు.

Tags:    

Similar News