Rishi Sunak : మెజారిటీ సపోర్ట్‌తో దుసుకెళ్లిపోతున్న రిషి..
Rishi Sunak : బ్రిటన్ ప్రధాని రేసులో ఉన్న మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్ మరింత ఆధిక్యం సాధించారు.;
Rishi Sunak : బ్రిటన్ ప్రధాని రేసులో ఉన్న మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్ మరింత ఆధిక్యం సాధించారు. కన్సర్వేటివ్ పార్టీ ఎంపీల తాజా ఓటింగులో 115 ఓట్లతో...ప్రధాని పదవికి పోటీ పడుతున్న నలుగురు అభ్యర్థుల్లో రిషి అగ్రస్థానంలో నిలిచారు. వాణిజ్య మంత్రి ఫెన్నీ మోర్డాంట్ 82 ఓట్లతో రెండో స్థానంలో...విదేశాంగ మంత్రి ట్రుస్ 71 స్థానంలో మూడో స్థానంలో ఉన్నారు. 58 ఓట్లతో కెమి బడెనోచ్ నాలుగో స్థానంలో నిలిచారు.
ఇవాళ మరో విడత పోలింగ్ జరగనుంది. గురువారం నాటికి బరిలో ఇద్దరు మాత్రమే మిగలనున్నారు. ఆ తర్వాత అర్హులైన కన్సర్వేటివ్ పార్టీ లక్షా 60 వేల మంది ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ప్రధానిని ఎన్నుకుంటారు.