Saudi Arabia : సౌదీలో సైడ్ స్క్రాపర్లు.. వందల కిలోమీటర్ల పొడవు..

Saudi Arabia : సౌదీ అరేబియాలో సైడ్ స్క్రాపర్లను నిర్మించడానికి ప్రణాళిక సిద్ధమైంది.

Update: 2022-07-26 10:30 GMT

Saudi Arabia : సౌదీ అరేబియాలో సైడ్ స్క్రాపర్లను నిర్మించడానికి ప్రణాళిక సిద్ధమైంది. స్కై స్ర్కాపర్లు అంటే భవనాలు చాలా ఎత్తుగా ఆకాశాన్ని తాకేలా ఉంటాయి. వీటినే ఆకాశ హర్యాలు అని మనమంటాము. అయితే సైడ్ స్క్రాపర్ల విషయానికి వస్తే.. భవనాల సైడుకు చాలా దూరం వరకు పొడవుగా కొన్ని వందల కిలోమీటర్ల వరకు ఉంటుంది.

సౌదీ యువరాజు, ఉప ప్రధాని మొహమ్మద్ బిన్ సల్మాన్ ఈ సైడ్ స్క్రాపర్లనను 26వేల 500ల చదరపు కిలోమీటర్ల మేర నిర్మించనున్న ప్రతిష్టాత్మక నియోమ్ సిటీలో భాగంగా నిర్మించనున్నారు. రెండు సైడ్ స్క్రాపర్లను నిర్మించడానికి ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. ఇవి పూర్తికావాలంటే 50 ఏళ్లు పట్టే అవకాశం ఉంది.

సుమారు 80 లక్షల కోట్లు ఖర్చు కానుంది. ఈ భవనంలో ఒక మూల నుంచి మరో మూలకు ప్రయాణం చేయడాననికి భూగర్భంలో హైస్పీడ్ రైల్వే లైన్ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ రెండు భవనాలను అద్దాలతో అలంకరించనున్నారు. అందుకే వీటికి మిర్రర్ లైన్‌గా పిలుస్తారు.





Tags:    

Similar News