Ukraine: ఉక్రెయిన్‌లో 19వేల మంది భారతీయులు.. వారి పరిస్థితి ప్రశ్నార్థకం..
Ukraine: ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన 19వేల మంది భారతీయుల పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారింది.;
Ukraine: ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన 19వేల మంది భారతీయుల పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారింది. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం కంబరివలస గ్రామానికి చెందిన కుమారస్వామి, వంశీకృష్ణ.. ఉక్రెయిన్‌లోని బోకోవిన్ యూనివర్సిటీలో చదువుతున్నారు. దీంతో తమ పిల్లలను సురక్షితంగా తీసుకురావాలంటూ విద్యార్ధుల కుటుంబ సభ్యులు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆఫీసుకి ఫోన్లు చేస్తున్నారు.
మరోవైపు, ఉక్రెయిన్‌లోని భారత విద్యార్థులను తీసుకొచ్చేందుకు ఎయిర్ఇండియా విమానం ఈ ఉదయం 7.30కు ఢిల్లీ నుంచి బయల్దేరింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని బోరిస్పిల్ ఎయిర్‌పోర్టుకు ఈ విమానం చేరుకోవాల్సి ఉంది. కాని, ఇంతలోనే గగనతలాన్ని మూసేస్తున్నట్లు ఉక్రెయిన్ ప్రకటించిన నేపథ్యంలో.. విమానం ఖాళీగా తిరిగొచ్చింది.