Brazil: వాటర్ ఫాల్స్ చూడడానికి బోట్లలో బయల్దేరారు.. చివరకు బండరాళ్లు మీద పడి..
Brazil: బ్రెజిల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. వారంతపు విహార యాత్ర కాస్త విషాద యాత్రలా మారింది.;
Brazil: బ్రెజిల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. వారంతపు విహార యాత్ర కాస్త విషాద యాత్రలా మారింది. సరస్సులో ఓ బోటుపై బండరాళ్లు పడి ఏడుగురు చనిపోయారు. మరో 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. మినాస్ గైరైస్ రాష్ట్రంలో ఫర్నస్ సరస్సులో ఈ ప్రమాదం జరిగింది. వీకెండ్ కావడంతో ఫర్నస్ లేక్ కు కొంతమంది విహార యాత్రకు వెళ్లారు. అంతా బోట్లలో వాటర్ ఫాల్స్ దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ఇదే టైంలో పక్కనే ఉన్న కొండపై నుంచి ఒక్కసారిగా బండరాళ్లు బోట్లపై పడ్డాయి. దీంతో ఏడుగురు అక్కడికక్కడే చనిపోయారు. ప్రమాద దృశ్యాలు కొందరు సెల్ ఫోన్ రికార్డు చేశారు.
URGENTE!!! Pedras se soltam de cânion em Capitólio, em Minas, e atingem três lanchas. pic.twitter.com/784wN6HbFy
— O Tempo (@otempo) January 8, 2022