UNICEF Photo of the Year: ఈ ఏడాది నెంబర్ వన్ ఫోటో ఇదే ఎందుకంటే..

UNICEF Photo of the Year: ఫోటోలు అనేవి కదలకపోయినా.. అందులో మనసుకు హత్తుకునే భావాలు ఎన్నో ఉంటాయి.

Update: 2021-12-30 11:22 GMT

UNICEF Photo of the Year: ఫోటోలు అనేవి కదలకపోయినా.. అందులో మనసుకు హత్తుకునే భావాలు ఎన్నో ఉంటాయి. ఎన్నో మాటల్లో చెప్పలేనిది ఒక్క ఫోటోతో చెప్పవచ్చేమో అనిపిస్తుంది కొన్ని ఫోటోలు చూస్తుంటే. కానీ ఓ ఫోటో అందంగా రావాలన్నా.. అందులో అందరినీ కదిలించే భావాలు ఉండాలన్నా.. అది కేవలం ఫోటోగ్రాఫర్ల మీదే ఆధారపడి ఉంటుంది. అలా ఇండియాకు చెందిన ఓ ఫోటోగ్రాఫర్ ప్రపంచవ్యాప్తంగా వినిపించేలా తన టాలెంట్‌ను చాటిచెప్పాడు.

ప్రతీ టాలెంట్‌కు ఒక అవార్డ్ ఉంటుంది. అలాగే ఫోటోగ్రాఫర్ల టాలెంట్‌కు కూడా ప్రతీ సంవత్సరం పలు అవార్డులు అందుతుంటాయి. అందులో ఒకటి యూనిసెఫ్ ఫోటో ఆఫ్ ది ఇయర్. ఈ యూనెటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ సంస్థ ప్రతీ ఏడు ఈ పోటీని నిర్వహిస్తుంటుంది. ప్రపంచ నలుమూలల నుండి వారి దగ్గరకు వచ్చే చిన్నారుల ఫోటోలు అన్నింటిని సమీక్షించి వాటిని కొన్నింటికి బహుమతులను అందజేస్తుంది. ఈ ఏడాది ఆ పోటీలో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంది ఓ ఇండియన్ ఫోటోగ్రాఫర్.


సుప్రతిమ్ భట్టాఛర్జీ తీసిన ఓ అమ్మాయి ఫోటో యూనిసెఫ్ ఫోటో ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది. ఆ ఫోటో వెనుక కథేంటంటే.. అందులో కనిపిస్తు్న్న అమ్మాయి పేరు పల్లవి. తాను తన కుటుంబంతో కలిసి పశ్చిమ బెంగాల్‌లోని గంగా నది పరివాహక ప్రాంతమైన నంఖానా ద్వీపంలో నివాసముండేవారు. 2020లో ముంచెత్తిన తుఫాను కారణంగా పల్లవి కుటుంబం ఇల్లు, టీ కొట్టు అన్నీ కోల్పోయి చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నారు.

తుఫాను వల్ల సర్వం కోల్పోయిన మరుసటి రోజే సుప్రతిమ్.. పల్లవిని కలిశాడు. ఆ సమయంలో తాను తీసిన ఫోటోనే యూనిసెఫ్ ఫోటో ఆఫ్ ది ఇయర్‌గా అవార్డును అందుకుంది. ఫస్ట్ ప్రైజ్ మాత్రమే కాదు ఈ పోటీలో సెకండ్ ప్రైజ్ అందుకుంది కూడా సౌరవ్ దాస్ అనే ఓ ఇండియన్ ఫోటోగ్రాఫరే. వారు తీసిన ఫోటోలతో వారు చెప్పాలనుకున్న కథలు చాలా బాగున్నాయని ఈ ఫోటోలు చూసినవారు ప్రశంసిస్తున్నారు.



Tags:    

Similar News