RR vs CSk : రాజస్థాన్ రాయల్స్‌పై చెన్నై విజయం
189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టు ఛేదనలో వెనుకబడింది. టాపార్డర్‌లో బట్లర్ 49 పరుగులు చేశాడు.;
ఐపీఎల్ 14వ సీజన్‌లో మహేంద్రసింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ మెరిసింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన చెన్నై.. సీజన్‌లో అద్భుత విజయాన్ని అందుకుంది. బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ధోనీసేన 45 పరుగుల తేడాతో నెగ్గింది.
189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టు ఛేదనలో వెనుకబడింది. టాపార్డర్‌లో బట్లర్ 49 పరుగులు చేశాడు. బట్లర్ తర్వాత ఆ జట్టు బ్యాట్స్‌మెన్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టారు. కెప్టెన్ శాంసన్ 4 పరుగులతో మరోసారి నిరాశ పరిచాడు. ఈ జట్టులో ఉనద్కట్ 24, తెవాటియా 20, దూబే 17 పరుగులు మాత్రమే చేశారు.
మొత్తంగా చెన్నై స్పిన్నర్ల ధాటికి రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ బెంబేలెత్తారు. మొయీన్ అలీ 3, జడేజా 2 వికెట్లతో సత్తా చాటారు. వీరితో పాటు శామ్ కర్రాన్ రెండు, ఠాకూర్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. చివరకు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ జట్టు.. కేవలం 143 పరుగులే చేయగలిగింది. దీంతో చెన్నై జట్టు 45 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. బంతితోపాటు బ్యాటుతోనూ రాణించిన మొయీన్ అలీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.