కార్నర్‌ మీటింగ్స్‌పై బండి సంజయ్‌ సమీక్ష

Update: 2023-02-26 08:31 GMT

బీజేపీ ఆఫీస్‌లో కార్నర్‌ మీటింగ్స్‌పై బండి సంజయ్‌ సమీక్ష చేశారు. ప్రజాగోస, కార్నర్‌ మీటింగ్‌లపై వివరాలు తెలుసుకున్నారు. 15 రోజుల్లో 11వేల కార్నర్‌ మీటింగ్‌లకు బీజేపీ పిలుపునిచ్చింది. అయితే... ఆ గడువునిన్నటితో ముగిసింది. దీంతో మరో మూడ్రోజులు పొడిగించాలని నిర్ణయించారు. రెండ్రోజుల క్రితం రాష్ట్రనేతలతో సునీల్‌ బన్సల్‌, తరుణ్‌ చుగ్‌ సమావేశమై.... కార్నర్‌ మీటింగ్‌ల టార్గెట్‌ పూర్తి చేయాలని ఆదేశించారు.

కార్నర్‌ మీటింగ్‌లతోనే యూపీలో మళ్లీ అధికారంలోకి వచ్చామని, పశ్చిమబెంగాల్లోనూ ఈ ప్లాన్‌ సక్సెస్‌ అయిందని తెలిపారు బన్సల్‌. తెలంగాణలోనూ కార్నర్‌ మీటింగ్‌లతో ప్రజలకు చేరువ కావాలని సూచించారు. ఇవాళ మరోసారి కార్నర్ మీటింగ్‌లపై బండి సమీక్షించారు. దాడులను ఎదుర్కోవడంపై యాక్షన్‌ ప్లాన్‌ సిద్దం చేయనున్నారు బండి సంజయ్‌.

Similar News