Accident : కుప్పంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

Update: 2023-02-26 06:16 GMT


చిత్తూరు జిల్లా కుప్పంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.కుప్పం-పలమనేరు జాతీయ రహదారిపై శెట్టిపల్లి దగ్గర కారును లారీ బలంగా ఢీ కొట్టడంతోకారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు.మృతులు వికాస్‌,కళ్యాణ్‌,ప్రవీణ్‌గా గుర్తించారు. PES ఆస్పత్రితో డాక్టర్లుగా విధులు నిర్వహిస్తున్న వారు కారులో ప్రయాణిస్తున్నారు.ప్రమాదానికి అతి వేగమే కారణమని ప్రాధమికంగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Similar News