అసోం మాజీ సీఎంకి కరోనా పాజిటివ్
అసోం మాజీ సీఎం కరోనా బారిన పడ్డారు. మాజీ సీఎం, కాంగ్రెస్ నేత తరుణ్ గొగోయ్ కి కరోనా సోకింది.;
దేశంలో కరోనా స్వైర విహారం చేస్తోంది. ఇక అసోంలో కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. నిత్యం రాష్ర్టంలో పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఈ కరోనా మహమ్మారి సామన్యుల నుంచి రాజకీయ ప్రముఖుల వరకు ఎవరినీ వదలటం లేదు. తాజాగా అసోం మాజీ సీఎం కరోనా బారిన పడ్డారు. అసోం మాజీ సీఎం, కాంగ్రెస్ నేత తరుణ్ గొగోయ్ కి కరోనా సోకింది. ఈ విషయాన్ని తరుణ్ ట్వీట్ చేశాడు. 'నిన్న నాకు కోవిడ్-19 పాజిటివ్‌గా తేలింది. గత కొన్ని రోజులలో నాతో కాంటాక్ట్ అయిన వారు వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని' ఆయన ట్విట్టర్లో కోరారు.