భారత్ లోకి ప్రవేశించిన పాకిస్థాన్ డ్రోన్ ను BSF (Bharat Security Force) కూల్చివేసింది. ఆదివారం తెల్లవారుజామున పంజాబ్ లోని అమృత్ సర్ జిల్లాలో బీఎస్ఎస్ జవాన్లు పాకిస్థాన్ డ్రోన్ ను కూల్చివేశారు. ఇందుకుగాను ప్రకటన చేసింది బీఎస్ఎఫ్. పంజాబ్ అమృత్ సర్ లోని షాజాదా గ్రామ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున 2.11గంటలకు మానవ రహిత విమానం ఎగురుతున్నట్లు కనుగొన్న జవాన్లు డ్రోన్ కూల్చి వేసినట్లు తెలిపారు.
సరిహద్దు వద్ద మోహరించిన బీఎస్ఎఫ్ దళాలకు డ్రోన్ శబ్ధం వినిపించడంతో అప్రమత్తమయ్యారు. డ్రోన్ పై బలగాలు కాల్పులు జరపగా అది కూలిపోయింది. షాజాదా గ్రామ సమీపంలో ధుస్సీ బంద్ సమీపంలో పడి ఉన్న నల్ల రంగు డ్రోన్ DJI మ్యాటిస్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రోన్ చైనాలో తయారు చేసినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.