TS : టీడీపీకి పూర్వవైభవం తీసుకోద్దాం.. కార్యకర్తలకు కాసాని పిలుపు

Update: 2023-02-26 08:54 GMT

టీడీపీకి పూర్వవైభవం రావాలంటే కార్యకర్తలు ఇంటింటికి వెళ్లాలన్నారు టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్‌. గ్రామస్థాయి నుంచి ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టీడీపీ కొత్త ఉత్తేజంతో ముందుకు వెళ్తుందని, తెలంగాణ పూర్వవైభవం తేవడానికి బీసీలు సిద్దంగా ఉన్నారన్నారు. నెలరోజులు టీడీపీ శ్రేణులు గ్రామాల్లో ఉండాలన్నారు.

నేతలు వెళ్లిపోయినా...కార్యకర్తలు మాత్రం టీడీపీతోనే ఉన్నారని అన్నారు టీడీపీ సీనియర్‌ నేతల రావుల. చంద్రబాబు కృషివల్లే టీడీపీకి సుస్థిరత ఏర్పడిందన్నారాయన. ఇవాల్టి తరానికి టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తెలిజేయాలన్నారు. చంంద్రబాబు చేసిన కృషి వల్లే.. తెలంగాణ ప్రభుత్వానికి హైదరాబాద్‌ నుంచి 60శాతం ఆదాయం వస్తోందన్నారు.

Similar News