Viveka Murder Case : వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్‌

Update: 2023-04-16 12:24 GMT

మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్యకేసులో వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్‌ విధించారు సీబీఐ జడ్జి. ఈనెల 29 వరకు రిమాండ్‌ విధించారు. దీంతో ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు సీబీఐ అధికారులు. అటు.. భాస్కర్‌రెడ్డిని 10 రోజుల కస్టడీ కోరింది సీబీఐ. భాస్కర్‌రెడ్డి తరపు లాయర్లకు సీబీఐ జడ్జి నోటీసులు ఇచ్చారు. దీనిపై రేపు కౌంటర్‌ దాఖలు చేయనున్నారు భాస్కర్‌రెడ్డి తరపు లాయర్లు. ఇక.. భాస్కర్‌రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నాడని కోర్టుకు తెలిపిన లాయర్లు. మెరుగైన వైద్యం చేయించాలని జైలు అధికారులకు సీబీఐ కోర్టు ఆదేశించింది. బెయిల్‌ పిటిషన్‌ వేయగా సీబీఐ జడ్జి తిరస్కరించారు.

ఈ ఉదయం పులివెందులలోని నివాసంలో భాస్కర్‌రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు మెమో అందజేసి 120బి రెడ్‌విత్‌ 302, 201 సెక్షన్ల కింద అరెస్ట్‌ చేశారు. అనంతరం హైదరాబాద్‌ తరలించి ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేయించారు. ఆ తర్వాత సీబీఐ జడ్జి ముందు హాజరుపర్చగా.. ఆయనకు రిమాండ్‌ విధించారు.

Tags:    

Similar News