కేంద్ర ఆయుష్‌శాఖ మంత్రి శ్రీపాద్ నాయక్ ఆరోగ్యం విషమం!
కేంద్ర ఆయుష్‌శాఖ మంత్రి శ్రీపాద్ నాయక్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది.;
కేంద్ర ఆయుష్‌శాఖ మంత్రి శ్రీపాద్ నాయక్ కరోనా మహమ్మారి బారిన పడ్డారు. దీంతో ఆయన గోవా రాజధాని పనాజీలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని రావడంతో శ్రీపాద్ నాయక్ అగస్టు 12 నుంచి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం శ్రీపాద్ నాయక్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ఆయనలో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయాయని గోవా సీఎం ప్రమోద్ సావంత్ సోమవారం తెలిపారు.