మధ్యప్రదేశ్‌లో కొత్తగా 1292 కరోనా పాజిటివ్ కేసులు
మధ్యప్రదేశ్‌లో సోమవారం మొత్తం 1,292 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 53,175కు చేరింది;
దేశంలో కరోనా విజృంభిస్తోంది. మధ్యప్రదేశ్‌లో కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తోంది. రాష్ర్టంలో నిత్యం పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మధ్యప్రదేశ్‌లో సోమవారం మొత్తం 1,292 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 53,175కు చేరింది. కరోనా మహమ్మారి బారిన పడి 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11,944 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కరోనా నుంచి 41,231మంది కోలుకున్నారు. ఇప్పటివరకూ కరోనా బారిన పడి 1,246మంది మరణించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.