ఆగస్టు 27 నుంచి పాఠశాలలకు టీచర్లు..
స్టూడెంట్స్ అకడమిక్ ఇయర్ నష్టపోకుండా ఉండేందుకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 1 నుంచి స్కూల్స్..;
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ కరోనా నేపథ్యంలో తెలంగాణలో మార్చి 15న స్కూల్స్ మూతపడ్డాయి. అయితే మూత పడిన స్కూల్స్ కొత్త విద్యాసంవ్సరంలో సెప్టెంబర్ ఒకటో తేది నుంచి తెరుచుకోనున్నాయి. స్టూడెంట్స్ అకడమిక్ ఇయర్ నష్టపోకుండా ఉండేందుకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
2020-21 కొత్త విద్యాసంవత్సరాన్ని సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభిస్తున్నట్లు సర్కార్ ఆదేశాలిచ్చింది. అగస్టు 27 నుంచి టీచర్లు పాఠశాలకు హాజరుకావాలని సూచిచింది. సెప్టెంబర్ 1 నుంచి ఆన్‌లైన్ తరగతులు ప్రారంభమవుతాయని మార్గదర్శకాలు వెలువరించింది. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్ విద్యార్థులకు తరగతుల వారీగా ఎంత సమయం ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలనే విషయంపై స్పష్టతనిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.