Chattisgarh Maoists : మావోయిస్టుల మందుపాతరతో పదిమంది కూలీ మహిళలకు తీవ్ర గాయాలు..
Chattisgarh Maoists : పోలీసులే టార్గెట్‌గా మావోయిస్టులు అమర్చిన మందుపాతర కారణంగా మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి;
Chattisgarh Maoists : పోలీసులే టార్గెట్‌గా మావోయిస్టులు అమర్చిన మందుపాతర కారణంగా మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఐఈడీ బాంబు అమర్చారు. పది మంది గిరిజన మహిళలు నిన్న సాయంత్రం తునికాకు బోనస్ డబ్బులు తీసుకుని ఇంటికి తిరిగి వెళ్తుండగా.. మావోలు అమర్చిన ఐఈడీ బాంబుపై కాలు వేశారు. మందుపాతర పేలుడులో పది మంది మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని గల్గాం సీఆర్‌పీఎఫ్ శిబిరంలో ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. బీజాపూర్ జిల్లా ఊసూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని భూసాపూర్-గల్గాం మధ్య ఈ ఘటన జరిగింది.