రామమందిర ప్రారంభోత్సవ వేడుకలకు 1000 రైళ్లు..

రామమందిర ప్రారంభోత్సవం కోసం భారతీయ రైల్వే అయోధ్యకు 1,000 రైళ్లను నడపాలని యోచిస్తోంది.

Update: 2023-12-16 08:16 GMT

రామమందిర ప్రారంభోత్సవం కోసం భారతీయ రైల్వే అయోధ్యకు 1,000 రైళ్లను నడపాలని యోచిస్తోంది. ప్రారంభోత్సవానికి ముందు జనవరి 19 నుండి రైళ్లు నడపబడతాయి. జనవరి 23వ తేదీ నుంచి శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠానంతరం ప్రజల సందర్శనార్థం ఆలయం తెరవబడుతుంది. అయోధ్య ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, పూణే, కోల్‌కతా, నాగ్‌పూర్, లక్నో మరియు జమ్మూతో సహా వివిధ నగరాలకు అనుసంధానించబడుతుంది. అయోధ్య స్టేషన్ అధిక రద్దీని తట్టుకునేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. IRCTC తీర్థయాత్ర సమయంలో 24 గంటలూ క్యాటరింగ్ సేవలను అందిస్తుంది. సరయూ నదిపై ఎలక్ట్రిక్ కాటమరాన్ రైడ్ కొత్త ఆకర్షణ నిలవనుంది.

భారతీయ రైల్వే దేశంలోని వివిధ ప్రాంతాల నుండి అయోధ్యకు మొదటి 100 రోజులలో 1,000 రైళ్లను నడపాలని యోచిస్తోంది. ఈ రైళ్ల కార్యకలాపాలు జనవరి 19 నుండి ప్రారంభమవుతాయి. ప్రారంభోత్సవ వేడుకకు కొద్ది రోజుల ముందు నుంచి యాత్రికులు పవిత్ర నగరానికి చేరుకోవచ్చు. జనవరి 23, భగవాన్ శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన తర్వాత రోజు నుంచి ఆలయ సందర్శన గావించవచ్చు. రోజువారీ దాదాపు 50,000 మంది ప్రయాణీకులు రాకపోకలు సాగించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగానే అయోధ్య స్టేషన్ లో ఏర్పాట్లు చేశారు.  

Tags:    

Similar News