Maoists Surrender : 150 మంది మావోయిస్టు సానుభూతిపరులు సరెండర్
Maoists Surrender : ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.;
Maoists Surrender : ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అన్నలకు కంచుకోట అయిన కటాఫ్ ఏరియాలో సుమారు 150 మంది మావోయిస్టు మిలీషియా సభ్యులు పోలీసుల ముందు లొంగిపోయారు. మల్కాన్‌గిరి ఎస్పీ నితీష్ వాధ్వానీ, BSF డీఐజీ ఎస్కే సిన్ ముందు వీరు జన జీవన స్రవంతిలో కలిశారు.
కటాఫ్ ఏరియాలో అభివృద్ధి పనులు చూసే లొంగిపోయినట్లు మావోయిస్టు సానుభూతిపరులు వెల్లడించారు. ఇటీవల కటాఫ్ ఏరియాలో లొంగిపోయిన కొంతమంది మావోయిస్టు మిలీషియా సభ్యులు తమను లొంగిపోయేలా ప్రోత్సహించారన్నారు. మావోయిస్టు మిలీషియా సభ్యులకు దుస్తులు, నిత్యావసరాలు, క్రీడాసామాగ్రి ఇచ్చారు పోలీసులు.