Gyanesh Kumar: బీహార్ ఎన్నికల కొత్తగా 17 సంస్కరణలకు శ్రీకారం

బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ

Update: 2025-10-07 00:45 GMT

దేశ ఎన్నికల నిర్వహణలో సరికొత్త అధ్యాయానికి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) శ్రీకారం చుట్టింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలను ఒక ప్రయోగశాలగా మార్చి, ఏకంగా 17 కీలక సంస్కరణలను అమలు చేయనుంది. ఈ ఎన్నికల ఫలితాలతో పాటు, ఇక్కడ అమలు చేస్తున్న సంస్కరణల విజయవంతం ఆధారంగా భవిష్యత్తులో దేశవ్యాప్తంగా అన్ని ఎన్నికల్లోనూ వీటిని అమలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఓటర్ల జాబితా ప్రక్షాళన, పోలింగ్ ప్రక్రియలో పారదర్శకత పెంచడమే లక్ష్యంగా ఈ మార్పులు చేపట్టింది.

బీహార్‌లోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ ప్రకటించారు. నవంబర్ 6న తొలి విడత, నవంబర్ 11న రెండో విడత పోలింగ్ జరగనుండగా, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపడతారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికలు, ఓటర్ల జాబితా ప్రక్షాళన విషయంలో దేశానికి ఒక మార్గాన్ని చూపుతాయి" అని పేర్కొన్నారు.

అమల్లోకి రానున్న కీలక సంస్కరణలు ఇవే..

ఈసీ ప్రకటించిన 17 సంస్కరణల్లో ఓటర్లు, సిబ్బంది, రాజకీయ పార్టీలకు సంబంధించిన అనేక మార్పులు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి:

వంద శాతం వెబ్‌కాస్టింగ్: పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అక్రమాలు జరగకుండా, ప్రతి పోలింగ్ కేంద్రాన్ని పూర్తిగా వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తారు.

మొబైల్ డిపాజిట్ సౌకర్యం: ఓటర్లు తమ వెంట తెచ్చుకునే మొబైల్ ఫోన్లను భద్రపరిచేందుకు పోలింగ్ కేంద్రం బయట ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తారు.

ఈవీఎంలపై అభ్యర్థుల ఫోటోలు: ఓటర్లు తమ అభ్యర్థిని సులభంగా గుర్తించేందుకు, ఈవీఎం బ్యాలెట్ పేపర్లపై తొలిసారిగా అభ్యర్థుల రంగుల ఫోటోలను ముద్రిస్తారు.

రియల్-టైమ్ ఓటింగ్ సమాచారం: పోలింగ్ రోజున ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలింగ్ శాతం వివరాలను ప్రిసైడింగ్ అధికారులు 'ఈసీఐనెట్ యాప్' ద్వారా అప్‌లోడ్ చేస్తారు. దీంతో ఓటింగ్ సరళిని వేగంగా తెలుసుకోవచ్చు.

తప్పనిసరి వీవీప్యాట్ లెక్కింపు: ఫారం 17Cలోని డేటాకు, ఈవీఎం డేటాకు మధ్య తేడా వస్తే లేదా మాక్ పోల్ డేటాను తొలగించడంలో పొరపాట్లు జరిగితే, ఆయా కేంద్రాల్లో వీవీప్యాట్ స్లిప్పులను తప్పనిసరిగా లెక్కిస్తారు.

సిబ్బందికి ప్రోత్సాహకాలు: బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్‌ఓ), పోలింగ్, కౌంటింగ్ సిబ్బందికి రెమ్యూనరేషన్‌ను రెట్టింపు చేశారు.

వీటితో పాటు, బీఎల్‌ఓలకు ప్రత్యేక

Tags:    

Similar News