Deoghar Accident: ట్రక్కును ఢీకొన్న యాత్రికులతో వెళ్తున్న బస్సు.. 18 మంది మృతి
ఘోర ప్రమాదం..;
జార్ఖండ్‌లోని డియోఘర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యాత్రికులతో వెళ్తున్న బస్సు ట్రక్రును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చాలా మంది కన్వారియాలు గాయపడ్డారు. రోడ్డు ప్రమాదంలో కనీసం 18 మంది కన్వారియాలు మరణించారు. ఇందులో 20 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మోహన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జమునియా అడవి సమీపంలో కన్వారియాలతో వెళ్తున్న బస్సు గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టడంతో తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసు అధికారి తెలిపారు.
గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అదే సమయంలో, మృతుల మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. స్థానికులు ఈ సంఘటన గురించి మోహన్‌పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి ప్రియరంజన్‌కు సమాచారం అందించారు. ఆ తర్వాత ప్రియరంజన్ కుమార్ ఒక బృందంతో సంఘటనా స్థలానికి చేరుకుని, మోహన్‌పూర్ బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌కు సమాచారం అందించారు. సహాయక చర్యలు ప్రారంభించి గాయపడిన వారిని అంబులెన్స్ ద్వారా మోహన్‌పూర్ సిహెచ్‌సికి పంపారు. ఈ ప్రమాదంపై ఎంపీ నిషికాంత్ దూబే విచారం వ్యక్తం చేశారు. నా లోక్‌సభ నియోజకవర్గమైన దేవఘర్‌లో శ్రావణ మాసంలో కన్వర్ యాత్ర సందర్భంగా బస్సు, ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో 18 మంది భక్తులు మరణించారని ఆయన అన్నారు. బాబా బైద్యనాథ్ వారి కుటుంబాలకు ఈ నష్టాన్ని భరించే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాని తెలిపారు.