Maharashtra : 180 మంది మైన‌ర్ల‌పై లైంగికంగా వేధింపులు .. 350 వీడియోలు

నిందితుడు అరెస్టు

Update: 2026-04-15 04:00 GMT

 మైన‌ర్ అమ్మాయిల‌ ను లైంగికంగా వేధిస్తున్న మ‌హారాష్ట్ర వ్య‌క్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని మొహ‌మ్మ‌ద్ అయాజ్‌గా గుర్తించారు. అత‌న్ని త‌న్వీర్ అని కూడా పిలుస్తారు. అమ‌రావ‌తి జిల్లాలోని ప‌ర‌ట్వాడా సిటీ అత‌ని స్వ‌స్థ‌లం. సుమారు 180 మంది మైన‌ర్ అమ్మాయిల‌ను అత‌ను లైంగికంగా వేధించిన‌ట్లు తెలిసింది. వారితో సుమారు 350 అస‌భ్య‌క‌ర వీడియోల‌ను కూడా షూట్ చేశాడు. స్థానిక బీజేపీ ఎంపీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆ నిందితుడిని అరెస్టు చేశారు. ప్రేమ పేరుతో అత‌ను అమ్మాయిల‌ను ట్రాప్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఆ త‌ర్వాత వారిని ముంబై, పూణెకు తీసుకెళ్లేవాడు. అక్క‌డ అస‌భ్య‌క‌ర వీడియోల‌ను అత‌ను షూట్ చేసేవాడు. ఆ వీడియోల‌తో అత‌ను అమ్మాయిల‌ను బ్లాక్‌మెయిల్ చేసేవాడు. వారిని వ్య‌భిచారంలోకి దించేవాడు. కొన్ని వీడియోల‌ను ఆన్‌లైన్‌లో కూడా షేర్ చేశాడు.

వాట్సాప్‌, స్నాప్‌చాట్ గ్రూపుల ద్వారా మైన‌ర్ల‌ను అత‌ను టార్గెట్ చేసిన‌ట్లు రాజ్య‌స‌భ ఎంపీ అనిల్ బోండే ఇచ్చిన ఫిర్యాదులో ఉన్న‌ది. ఎస్పీ విశాల్ ఆనంద్‌కు ఎంపీ త‌న ఫిర్యాదును అంద‌జేశారు. ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు చేప‌ట్టేందుకు ప్ర‌త్యేక బృందాన్ని ఏర్పాటు చేయాల‌ని, లేదంటే ఎస్పీ ఆఫీసు ముందు ధ‌ర్నా చేప‌ట్ట‌నున్న‌ట్లు ఆయ‌న ఆ ఎంపీ వార్నింగ్ ఇచ్చారు. నిందితుడిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కొంద‌రు ముస్లిం క‌మ్యూనిటీ వ్య‌క్తులు కూడా పోలీసు స్టేష‌న్‌కు చేరుకున్నారు.

గ‌తంలో నిందితుడు అయాజ్‌.. ఎంఐఎం పార్టీ ఆఫీస్ బియ‌ర‌ర్‌గా చేశారు. అత‌ను త‌న సోష‌ల్ మీడియాలో ఆ పార్టీకి చెందిన కొన్ని ఫోటోలు, వీడియోలు షేర్ చేశారు. ఎంఐఎం అమ‌రావ‌తి అధ్య‌క్షుడు హ‌జి ఇర్ఫాన్ ఖాన్ నుంచి అత‌ను ఓ లేఖ‌ను అందుకుంటున్న‌ట్లు ఓ ఫోటో కూడా ఉన్న‌ది. పార్టీ ర్యాలీల‌కు చెందిన రీల్స్ కూడా అత‌ను త‌న సోష‌ల్ మీడియా అకౌంట్‌లో పోస్టు చేశాడు. అయితే ఈ కేసు న‌మోదు కాగానే, ఆ పార్టీ ఆ వీడియోల‌ను డిలీట్ చేసింది.

నిందితుడు అయాజ్‌ను అరెస్టు చేసిన పోలీసులు అత‌న్ని కోర్టులో ప్ర‌వేశ‌పెట్టారు. ఏడు రోజుల పాటు క‌స్ట‌డీలోకి తీసుకున్నారు. త‌న మొబైల్ ఫోన్‌ను సీజ్ చేశారు. దాంట్లో అభ్యంత‌రక‌ర వీడియోలు ఉన్న‌ట్లు పోలీసులు చెబుతున్నారు. ఆ వీడియోల‌ను అత‌ను త‌న స్నేహితుల‌తో కానీ, నేర‌గాళ్ల గ్రూపుల‌కు కానీ షేర్ చేశాడా లేదా అన్న విష‌యాన్ని ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని పోలీసులు పేర్కొన్నారు.

Tags:    

Similar News