Sabarmati Express: పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్‌ప్రెస్
ఉత్తర్‌ప్రదేశ్‌లో తప్పిన ఘోర ప్రమాదం;
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ రైల్వేస్టేషన్‌కు సమీపంలో సబర్మతి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. భారీ బండరాయిని రైలు ఇంజిన్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తు. కాన్పూర్- భీమ్ సేన్ స్టేషన్ల మధ్య నడిచే రైలు నెంబర్ 19168 సబర్మతి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. భీమ్‌సేన్ స్టేషన్ మధ్య బ్లాక్ సెక్షన్‌లో ఈ ఘరం జరిగింది. ఈ దుర్ఘటనలో ఎవరికి ఎలాంటి నష్టం జరగలేదు. కాన్పూర్ సహా వివిధ గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన ప్రయాణికులను బస్సుల్లో అక్కడి నుంచి తరలించారు.
రైలు కాన్పూర్ నుంచి సబర్మతి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. భీంసేన్ స్టేషన్‌కు కొద్ది దూరంలోనే ట్రైన్ ప్రమాదానికి గురైంది. ఇంజిన్‌ను రాళ్లు ఢీకొనడంతో కాటిల్ గార్డు తీవ్రంగా దెబ్బతిని వంగి ఉన్నట్లు ప్రాథమికంగా తెలుస్తోందని లోకో పైలట్ తెలిపారు. దీంతో రైలు పట్టాలు తప్పిందన్నారు. అయితే పూర్తి విచారణ తర్వాతే ఏదో ఒకటి చెప్పగలమన్నారు.
యూపీలోని కాన్పూర్-భీమ్‌సేన్ స్టేషన్ల మధ్య బ్లాక్ సెక్షన్‌లో శనివారం తెల్లవారుజామున 19168 నంబరు గల సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. భీమ్‌సేన్ సమీపంలోని కాన్పూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన అరగంట తర్వాత, తెల్లవారుజామున 2.32గంటలకు రైలు పట్టాలు తప్పింది.
మరో వైపు కాన్పూర్‌కు ప్రయాణికులను తరలించేందుకు వీలుగా భారతీయ రైల్వే బస్సులను ఇప్పటికే ఘటనాస్థలానికి పంపించింది. బస్సుల ద్వారా సబర్మతీ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులను కాన్పూర్‌కు తీసుకెళ్లి, అక్కడి నుంచి ప్రత్యేక రైలు ద్వారా గమ్యస్థానానికి చేరుస్తామని అధికారులు తెలిపారు. సబర్మతి ఎక్స్‌ప్రెస్ యూపీలోని వారణాసి నుంచి గుజరాత్‌లోని అహ్మదాబాద్ వరకు సేవలను అందిస్తుంది. ఇదిలా ఉండగా.. అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్సులు సైతం ఘటనాస్థలానికి చేరుకున్నాయి. క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ప్రయాణికుల్లో ఎవరికీ గాయాలు అవ్వలేదని నిర్ధారించారు.