MANIPUR: మణిపూర్ ఘటనలో మైనర్ అరెస్ట్
మణిపూర్ అమానవీయ ఘటనలో ఆరో నిందితుడి అరెస్ట్;
మణిపుర్‌లో ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించి సామూహిక అత్యాచారం చేసిన ఘటన(Manipur viral video case)లో మరో మైనర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టయిన నిందితుల సంఖ్య ఆరు(6th accused) కు చేరింది. ఇప్పటికే ప్రధాన నిందితుడుసహా నలుగుర్ని మణిపుర్ పోలీసులు(police caught) అరెస్టు చేశారు. కాంగ్ పోక్పి జిల్లాలో మే నాల్గో తేదీన జరిగిన ఈ ఘటనకు సంబంధించిన 26సెకన్ల నిడివి కలిగిన దృశ్యాలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో దర్శనం ఇవ్వటంతో ఈ అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన అనంతరం సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనను యావత్ దేశం తీవ్రంగా ఖండించింది.