Bihar HIV Cases: బీహార్ ఒకే జిల్లాలో 7400 మందికి హెచ్‌ఐవీ పాజిటివ్
బాధితుల్లో 400 మంది చిన్నారులు ?
బీహార్ రాష్ట్రంలో హెచ్‌ఐవీ పాజిటివ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒక్క సీతామర్హి జిల్లాలోనే ఏకంగా 7,400 మందికిపైగా హెచ్‌ఐవీ పాజిటివ్‌గా తేలింది. వారిలో 400 మందికిపైగా చిన్నారులే ఉండటం గమనార్హం. జిల్లా ఆసుపత్రిలోని ఏఆర్‌టీ సెంటర్‌లో నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఈ షాకింగ్ వాస్తవాలు బయటపడ్డాయి.
400 మందికిపైగా పిల్లలకు వారి తల్లిదండ్రుల నుంచి వైరస్ సంక్రమించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇది చాలా ఆందోళనకరమైన పరిస్థితి అని వైద్య అధికారులు తెలిపారు. తల్లిదండ్రుల్లో ఎవరికి హెచ్‌ఐవీ ఉన్నా, పుట్టబోయే పిల్లలకు ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని చెప్పారు. ఈ పరిస్థితిపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ హసీన్ అక్తర్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రతి నెలా సగటున 50 నుంచి 60 కొత్త హెచ్‌ఐవీ కేసులు నమోదవుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం గుర్తించిన బాధితుల్లో దాదాపు 5,000 మంది రోగులకు వైద్య చికిత్స, మందులు అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. హెచ్‌ఐవీపై ప్రజల్లో అవగాహన లేకపోవడమే ఈ పరిస్థితికి కారణంగా ఆయన పేర్కొన్నారు.
ఈ పరిస్థితిపై జిల్లా వైద్యాధికారి డాక్టర్ హసీన్ అక్తర్ మాట్లాడుతూ.. "జిల్లాలో ప్రతి నెలా సగటున 50 నుంచి 60 కొత్త హెచ్‌ఐవీ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం గుర్తించిన బాధితుల్లో 5 వేల మందికి పైగా వైద్య చికిత్స అందిస్తున్నాం" అని తెలిపారు. ఈ గణాంకాలు వ్యాధి తీవ్రతకు అద్దం పడుతున్నాయి.