Kerala: పెళ్లయిన కొన్నిరోజులకే వరుడు మృతి.. ఫోటోషూటే కారణం..

Kerala: నదీ ప్రవాహం ఎక్కువగా ఉండడంతో రెజిల్‌ను బయటికి తీసుకువచ్చేలోపే అతడు మృతిచెందినట్టు తెలుస్తోంది.

Update: 2022-04-05 10:53 GMT

Kerala: ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్, పెళ్లి ఫోటోషూట్స్‌కు ఈరోజుల్లో క్రేజ్ మామూలుగా లేదు. ఈ ఫోటోషూట్స్ కోసం ఎంత ఖర్చు పెట్టడానికి అయినా.. ఎంత దూరం వెళ్లడానికి అయినా.. ఎంత రిస్క్ తీసుకోవడానికి అయినా.. కపుల్స్ వెనకాడట్లేదు. దాని వల్ల పలుచోట్ల ప్రమాదాలు కూడా చోటుచేసుకున్నాయి. అయితే తాజాగా కేరళ అలాంటి ఒక విషాదకరమైన ఘటనే చోటుచేసుకుంది. కొత్తగా పెళ్లయిన ఆ ఇంట్లో అప్పుడే విషాదఛాయలు మిగిలేలా చేసింది.

కేరళలోని కోజికోడ్‌లో పాలేరీ ప్రాంతానికి చెందిన రెజిల్‌కు కనికతో మార్చి 14న వివాహం జరిగింది. వీరిద్దరు పోస్ట్ వెడ్డింగ్ ఫోటోషూట్ కోసం కట్టియాడి నది దగ్గరకు వెళ్లారు. ఫోటోషూట్ జరుగుతుండగా.. వారిద్దరు ప్రమాదవశాత్తు నది ప్రవాహంలో చిక్కుకుపోయారు. వారు అరుపులు విన్న స్థానికులు ఇద్దరినీ వెంటనే నదిలో నుండి బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు.

నదీ ప్రవాహం ఎక్కువగా ఉండడంతో రెజిల్‌ను బయటికి తీసుకువచ్చేలోపే అతడు మృతిచెందినట్టు తెలుస్తోంది. కనిక మాత్రం ప్రాణాపాయ స్థితిలో ఉండగా.. తనను మలబార్ మెడికల్ కాలేజీకి తరలించారు. కట్టియాడి నది దగ్గర ఇంతకు ముందు కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగాయని స్థానిక పోలీసులు చెప్తున్నారు. రెజిల్ మరణంతో ఆ ఇంట విషాదఛాయలు నెలకొన్నాయి. 



Tags:    

Similar News